మాచర్ల నియోజక వర్గం: ‘పోరీ సూపరో’ వీడియో సాంగ్‌ విడుదల

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ నటించిన మూవీ ‘మాచర్ల నియోజక వర్గం’. ఈ సినిమాలో కృతిశెట్టి కేథరిన్ హీరోయిన్‌లుగా నటించారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్. సుధాకర్ రెడ్డి నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఎడిటర్ ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ఆగస్టు 12న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. సముద్రఖని విలన్ గా నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ వీడియోలతో పాటు లిరికల్ వీడియోలను విడుదల చేస్తూ వస్తోంది.

తాజాగా కృతిశెట్టి నితిన్ ల కయికలో రూపొందిన `పోరీ సూపరో యయితు వండరో..` అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేసింది. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. మహతి స్వరసాగర్ రాహుల్ సిప్లిగంజ్ గీతా మాధురి ఆలపించారు. పాటలో నితిన్- కృతి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. ఇదిలా వుంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆగస్టు 7న హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates