HomeTelugu Big Stories"ఆదిపురుష్"గా ప్రభాస్‌

“ఆదిపురుష్”గా ప్రభాస్‌

Prabhas 22 movie title and
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్ర‌భాస్‌కు బాహుబ‌లి చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దీంతో ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ డైరెక్టర్‌లు సైతం ముందుకు వస్తున్నారు. ఈ క్ర‌మంలో ‘తానాజీ’ డైరెక్టర్‌ ఔంరౌత్‌తో క‌లిసి ప్ర‌భాస్ సినిమా చేయ‌నున్నాడు. అయితే ఈ చిత్రం ఎలాంటి నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంద‌నే అనే అంశంపై ఈ రోజు మంగళ వారం ఉద‌యం 7.11 నిమిషాల‌కు ఈ మూవీ టైటిల్‌ను పోస్ట‌ర్‌తో స‌హా విడుద‌ల చేశారు. ప్ర‌భాస్ 22వ సినిమాకు “ఆదిపురుష్” అనే పేరును ఖ‌రారు చేస్తున్న‌ట్లు హీరో ప్ర‌భాస్‌, ద‌ర్శ‌కుడు ఓంరౌత్ ప్ర‌క‌టించారు. “చెడుపై మంచి సాధించే విజ‌యాన్ని పండ‌గ‌లా జ‌రుపుకుందాం” అనేది క్యాప్ష‌న్‌.

ఈ పోస్ట‌ర్‌లో హ‌నుమంతునితోపాటు ఎంద‌రో మునులు కూడా ఉన్నారు. దీన్ని బ‌ట్టి ఇది పౌరాణిక చిత్ర‌మ‌ని సులువుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది.ఈ సినిమా త్రీడీలో రూపుదిద్దుకుంటుంది. హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ నిర్మిస్తోంది. సుమారు రూ.500 కోట్ల బ‌డ్జెట్‌ కేటాయించారు. వ‌చ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేస్తామంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu