ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ లుక్‌ వైరల్‌


టాలీవుడ్‌ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ లుక్ వైరల్‌ అవుతుంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరావుత్‌ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ రాముడిగా నటిస్తుంటే, రావణాసురుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నాడు. కాగా.. ‘ఆదిపురుష్‌’ అనౌన్స్‌ చేసినప్పటి నుండి రాముడి లుక్‌లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడనే ఆసక్తి ప్రేక్షకాభిమానులందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని.. రాముడిగా ప్రభాస్ లుక్‌ ఇలా ఉంటుందంటూ యానిమేషన్‌లో ఓ లుక్‌ను తయారు చేసి పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ యానిమేషన్‌ లుక్‌(ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.”ఈ లుక్‌ చూసి స్టన్‌ అయ్యాను.. మీకు చాలా శక్తి ఉంది” అంటూ ఈ యానిమేషన్‌ లుక్‌పై దర్శకుడు ఓంరావుత్‌ కూడా స్పందించడం విశేషం. కాగా ప్రస్తుతం ప్రభాస్‌ రాధేశ్యామ్‌ సినిమాలో బీజీగా ఉన్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates