ప్రభాస్ కోసం ఖరీదైన కార్లు!

 

 

prabhas

బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 సినిమా
షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తరువాత తన సొంత బ్యానర్ అయిన
యు.వి.క్రియేషన్స్ లో వరుస సినిమాలు చేయనున్నాడు. ఇందులో భాగంగా ముందుగా
‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు
సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రభాస్ బాడీ
ల్యాంగ్వేజ్ కు తగ్గట్లుగా సరికొత్త యాక్షన్ త్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో
ప్రభాస్ కొత్త లుక్ తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు అదనపు
హంగులు తీసుకురావడానికి ఖరీదైన మోడ్రన్ కార్లను ఉపయోగించనున్నారు. ఆటోమొబైల్స్
అంటే యూత్ లో క్రేజ్ ఉంటుంది. అందుకే ఆయా కంపనీలు తమ కార్లను సినిమాలు చూపించి
ప్రభాస్ ద్వారా బ్రాండింగ్ చేయాలనుకుంటున్నారు. ఇవి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని
చెబుతున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates