HomeTelugu Big Storiesప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌లో జీవిత, హేమ

ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌లో జీవిత, హేమ

Prakash raj panel members i

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ తమ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే .ఇప్పటివరకూ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించిన నటీమణులు హేమ, జీవితా రాజశేఖర్‌లు ఇప్పుడు వారు ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి బరిలోకి దిగారు. ఈ విషయాన్ని ప్రకాశ్‌రాజ్‌ స్వయంగా వెల్లడించారు. శుక్రవారం ‘‘సిని‘మా’బిడ్డలం’’ పేరుతో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్యానెల్‌లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ప్రకటించారు.

‘‘ఇండస్ట్రీకి సేవ చేయాలనే వచ్చా. సినీ పరిశ్రమకు ఎంతో చేయాలని ఉంది. మాకు అవకాశం ఇస్తే అది చేసి చూపిస్తాం. గతంలో కొందరు సభ్యులతో విలేకరుల ముందుకు వచ్చా. వారు ప్యానల్‌ సభ్యులు కాదు. కేవలం నా శ్రేయోభిలాషులు మాత్రమే. ఇప్పుడు ‘మా’ ప్యానెల్‌ను ప్రకటిస్తున్నా. ఇందులో మహిళలకూ సమాన అవకాశం ఇస్తున్నాం. అందరూ హేమ, జీవితారాజశేఖర్‌లు అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ చేస్తారని భావించారు. ఈ విషయమై హేమగారితో నేను మాట్లాడా. ‘మనందరం కలిసి ఉండాలి మీరేమంటారు’ అని అడిగాం.

‘నేను ప్రెసిడెంట్‌గా పోటీ చేయను. మీ ఆలోచనలు నాకు నచ్చాయి. మీ ప్యానెల్‌లో పోటీ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని హేమ అన్నారు. ఆమె చాలా ధైర్యవంతురాలు. గతంలో పని చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే మా ప్యానెల్‌లో తీసుకున్నాం. ఇక జీవితా రాజశేఖర్‌గారు కూడా అధ్యక్ష బరిలో ఉంటారని అనుకున్నారు. ఆమెతో రెండు గంటలకు పైగా మాట్లాడా. మా కార్యచరణను ఆమె ముందు ఉంచాను. ఆ విషయాలన్నీ ఆమెకు నచ్చాయి. దీంతో నా ప్యానెల్‌లో పోటీ చేయడానికి ఒప్పుకొన్నారు. రాజశేఖర్‌గారు కూడా మద్దతు ఇస్తానని అన్నారు’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.

అధ్యక్షుడు- ప్రకాశ్‌రాజ్‌, ట్రెజరర్‌-నాగినీడు, జాయింట్‌ సెక్రటరీ: అనితా చౌదరి, జాయింట్‌ సెక్రటరీ: ఉత్తేజ్‌, ఉపాధ్యక్షుడు: బెనర్జీ, ఉపాధ్యక్షుడు- హేమ, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌-శ్రీకాంత్‌, జనరల్‌ సెక్రటరీ-జీవితా రాజశేఖర్‌.

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో ఈసీ మెంబర్స్‌ : అనసూయ, అజయ్‌, బి.భూపాల్, బ్రహ్మాజీ, బుల్లితెర నటుడు ప్రభాకర్‌, గోవిందరావు, ఖయ్యూం, కౌశిక్‌, ప్రగతి, రమణరెడ్డి, శివారెడ్డి, సమీర్‌, సుడిగాలి సుధీర్‌, డి.సుబ్బరాజు, సురేశ్‌ కొండేటి, తనీశ్‌, టార్జాన్‌ ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu