HomeTelugu Big Storiesరివ్యూ: కేశవ

రివ్యూ: కేశవ

నటీనటులు: నిఖిల్, రీతూ వర్మ, ప్రియదర్శి, అజయ్, రావు రమేష్ తదితరులు 
కెమెరా: దివాకర్‌ మణి,
సంగీతం: సన్నీ యం.ఆర్‌.
సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల
నిర్మాత: అభిషేక్‌ నామా
సమర్పణ: దేవాన్ష్‌ నామా
కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సుధీర్‌వర్మ.
హిట్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు యంగ్‌ హీరో నిఖిల్‌.‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’, ‘కార్తికేయ’… మూడేళ్లుగా నిఖిల్‌ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. ఈ జైత్రయాత్ర ‘స్వామి రారా’ నుంచి మొదలైంది్. నిఖిల్‌ సూపర్‌హిట్‌ ఇన్నింగ్స్‌కి స్ట్రాంగ్‌ పునాది వేసిన దర్శకుడు సుధీర్‌వర్మ. ‘స్వామి రారా’ తర్వాత నిఖిల్, సుధీర్‌వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘కేశవ’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారిని ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
 
కథ: 
కేశవ శర్మ(నిఖిల్) ‘లా’ కాలేజ్ లో స్టూడెంట్. చదువుకుంటూనే కొందరు పోలీసులను టార్గెట్ చేస్తూ హత్యలు చేస్తుంటాడు. ఈ హత్యల వెనుక ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ షర్మిలా మిశ్రా(ఇషా కొప్పికర్) అనే అధికారిని నియమిస్తుంది. హంతకుడు ఏ ఒక్క క్లూని కూడా విడిచిపెట్టకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించడంతో పోలీసులకు ఈ కేసు అంతుచిక్కకుండా పోతుంది. అసలు కేశవ హత్యలు చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి..? పోలీసులు చివరకు కేశవను పట్టుకోగలిగారా..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
 
విశ్లేషణ: 
గొప్పగా, కొత్తగా చెప్పడానికి నాది కథ కాదు.. బాధ అంటూ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్స్ తో నిఖిల్ ఈసారి మరో కొత్త కథను చెప్పబోతున్నాడని అందరూ అనుకున్నారు. కుడివైపు గుండె గల వ్యక్తి టెన్షన్ పడినా, పరిగెత్తినా హార్ట్ రేట్ పెరిగి చనిపోయే పరిస్థితి గల మనిషి తన పగను ఎలా తీర్చుకున్నాడనేది సినిమాలో మెయిన్ పాయింట్. పూర్తి స్థాయి ప్రతీకార నేపధ్యంలో సాగే సినిమా. తల్లితండ్రులను పోగొట్టుకున్న ఓ కుర్రాడు చిన్నప్పుడే దానికి కారణమైన వాళ్ళను చంపాలనుకుంటాడు. కథలో కొత్తదనం లేకపోయినా.. కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అది కొంత వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి.
ఈ సినిమాను మొత్తం తన భుజాలపై వేసుకొని నడిపించాడు నిఖిల్. సినిమా మొత్తం సీరియస్ లుక్ తో కనిపించి తనలోని కొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించాడు. రీతూవర్మ పాత్ర పెద్దగా ఏం ఉండదు. ఇషా కొప్పికర్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో బాగా నటించింది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ల కామెడీ పండింది. రావు రమేష్, అజయ్ తమ పాత్రల పరిధుల్లో బాగా నటించారు.  
సినిమాలో పాటు కథలో భాగంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథను ఇంకాస్త ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ వర్క్ చాలా క్రిస్పీగా ఉంది. అతి తక్కువ బడ్జెట్ లోనే సినిమాను చిత్రీకరించారు. మొత్తానికి స్వామిరారా వంటి మ్యాజిక్ ను
క్రియేట్ చేయకపోయినా.. నిఖిల్ కోసం మాత్రం ఒకసారి ఈ సినిమా చూడొచ్చు. 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu