చరణ్ సినిమాలో మరో విలక్షణ నటుడు!

సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘జగడం’ సినిమాలో ఓ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ ను మళ్ళీ ఇన్నాళ్లకు తన సినిమాలో నటించే అవకాశం కల్పించారు దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం సుక్కు, రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రకాష్ రాజ్ పాత్ర డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రకాష్ షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు భీభత్సంగా ఉన్నప్పటికీ నిర్విరంగా షూటింగ్ జరుపుతున్నారు. చరణ్ కూడా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. గతంలో చరణ్, ప్రకాష్ రాజ్ కలిసి నటించిన సంధార్భాలు ఉన్నాయి.