HomeTelugu Trendingడిస్కవరీ వైల్డ్‌లైఫ్‌లో ప్రకాశ్ రాజ్ గొంతు.!

డిస్కవరీ వైల్డ్‌లైఫ్‌లో ప్రకాశ్ రాజ్ గొంతు.!

8 25వైల్డ్‌ లైఫ్‌ అభిమానుల కోసం డిస్కవరీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందుకు తగ్గట్టు అభిమానులను మరింత ఆకట్టుకునేలా ప్రాంతీయ భాషలకు పరిచయమున్న గొంతులోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలనుకుంటుంది డిస్కవరీ. దీంతో సౌత్‌ ఇండియాలో మంచి పేరున్న, వినసొంపుగా ఉన్న గొంతు కోసం నటులను వెతుకుతుందంట. ఈ క్రమంలోనే ఛానల్ ప్రతినిధులు విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ను సంప్రదించిందించారట. ఈ కార్యక్రమాలకు తన గొంతును ఇవ్వడానికి నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా ఆసక్తి చూపించారట. దీంతో ఆయన కూడా అంగీకరించడంతో డబ్బింగ్‌ కార్యక్రమం కూడా మొదలయిపోయింది. తెలుగు, తమిళం భాషల్లో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తన వాయిస్‌ ద్వారా డిస్కవరీ వైల్డ్‌ లైఫ్‌ కార్యక్రమానికి తన గొంతు వినిపిస్తున్నారు.

ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తనకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా భావిస్తున్నానంటూ ప్రకాశ్‌ రాజ్‌ తన గొంతుతో ఉన్న ఓ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. దీనికి అనేక మంది సెలెబ్రెటీలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రీ ట్వీట్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రకాశ్ రాజ్ అభిమానులంతా ఈ విషయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదో చక్కని అవకాశం అంటూ ప్రశంసిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu