HomeTelugu Trendingఇద్దరు బలవంతులు జత కలిశారు

ఇద్దరు బలవంతులు జత కలిశారు

Prashanth neel and jr ntr m
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈరోజు.ఈ సందర్భంగా సినిమా యూనిట్ శక్తిమంతమైన పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాతో పాటు ‘కేజీఎఫ్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తోనూ మరో సినిమా చేయనున్నాడు తారక్. ఎప్పటి నుంచో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోపై వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు ఆ ఊహాగానాలకు తెరదించుతూ.. ఎన్టీఆర్ 31వ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. మరచిపోలేని ప్రయాణంలో ఇద్దరు బలవంతులు జత కలిశారంటూ ట్వీట్ చేసింది. ఇది భారీ చిత్రమని ప్రకటించింది.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమాను చేయనున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

froala 441e64556321jpg

Recent Articles English

Gallery

Recent Articles Telugu