ప్రేమమ్ ట్రైలర్ కు 2 మిలియన్ వ్యూస్!

నాగచైతన్య హీరోగా శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ప్రేమమ్’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్’ చిత్రానికి ఇది రీమేక్. దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదలయిన ఈ ట్రైలర్ ను సుమారుగా ఇరవై లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. అతి తక్కువ సమయంలో ట్రైలర్ కు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని నిర్మాత నాగవంశీ తెలియజేశారు. దీంతో సినిమాపై మాలో మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని అన్నారు. ప్రేక్షకుల అంచనాలకు తప్పకుండా ఈ సినిమా రీచ్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates