Ego clashes between Rana and Dulquer:
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఈ మధ్యకాలంలో నటనతో కంటే నిర్మాతగా ఎక్కువగా బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా కాంత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగు చూసింది. ఈ సినిమా కథ సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న సంఘటనలపై ఆధారపడి ఉంటుందట.
రానా దగ్గుబాటి, దుల్కర్ మధ్య ఈగో సమస్యలే ఈ చిత్ర ప్రధానాంశం అని టాక్. ఈ సినిమాలో రానా ఒక ప్రముఖ నటుడిగా నటిస్తుండగా, దుల్కర్ ఒక సహాయ దర్శకుడి పాత్రను పోషిస్తున్నారట. సీనియర్ నటుడు సముద్రఖని, ఈ సినిమాలో దర్శకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈగో సమస్యలు, ఒక నటుడికి, సహాయ దర్శకుడికి మధ్య ఉండే సంబంధాలను ఈ చిత్రం చూపించబోతున్నట్లు సమాచారం.
Read More: Salaar నటుడు ముంబై లో కొన్న ప్రాపర్టీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఇలాంటి ఈగో సమస్యలను గతంలో మలయాళ చిత్రాలు డ్రైవింగ్ లైసెన్స్, అయ్యప్పనుమ్ కోషియుమ్ చూపించయిం. అవి భారీ విజయాలను కూడా సొంతం చేసుకున్నాయి. అందులో అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగులో భీమ్లా నాయక్ అనే టైటిల్ తో రీమేక్ అయ్యింది. అందులో కూడా రానా దగ్గుబాటి పవన్ కళ్యాణ్ తో నటించారు.
కాంత సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.