మలయాళ దర్శకుడితో వెంకీ..?

ప్రేక్షకుల మనసులను కదిలించే కథలను సిద్ధం చేసి వాటిని తెరపై అధ్బుతంగా ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడు దర్శకుడు ప్రియదర్శన్. తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు తెలుగులో కూడా నిర్ణయం, గాంఢీవం వంటి సినిమాలను తెరకెక్కించారు. రీసెంట్ గా మోహన్ లాల్ హీరోగా మలయాళంలో ‘ఒప్పం’ సినిమాను తెరకెక్కించి సక్సెస్ ను అందుకున్నారు. తొంబైకి పైగా చిత్రాలను తెరకెక్కించిన ఈ లెజండరీ డైరెక్టర్ ఇప్పుడు వెంకటేష్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడట. వెంకీ నటించిన ఆఖరి చిత్రం ‘గురు’.

ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటి నుండి కూడా వెంకీ ఖాళీగానే ఉంటున్నారు. కిషోర్ తిరుమల, పూరీ జగన్నాథ్ వంటి దర్శకులతో పని చేయడానికి వెంకీ పూనుకున్నా.. అవి వర్కవుట్ కాలేదు. దీంతో వెంకీ స్వయంగా ప్రియదర్శన్ ను ఓ కథ రాయమని అడిగారట. దానికి సానుకూలంగా స్పందించిన ప్రియదర్శన్ వెంకీ కోసం ప్రత్యేకంగా కథ సిద్ధం చేసే పనిలో పడ్డారు. దాదాపు ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ అయినట్లే!