HomeTelugu Trending'అశ్వథ్థామ' చిత్రానికి ప్రాణం పెట్టి చేశాం..

‘అశ్వథ్థామ’ చిత్రానికి ప్రాణం పెట్టి చేశాం..

6 1
యంగ్‌ హీరో నాగశౌర్య కెరియర్లో ‘అశ్వథ్థామ’ చిత్రం భారీ ఓపెనింగ్స్ తెచ్చిందని చిత్ర నిర్మాత శౌర్య తల్లి ఉషా మూల్పూరి అన్నారు. అశ్వథామ సినిమాను ప్రేక్షకులను ఆదరిస్తున్నందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. శౌర్యను ప్రేక్షకులు మాస్ హీరోగా నవీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. శౌర్య చిన్నతనం నుంచే మాస్ అని కానీ పైకి మాత్రం అమాయకుడిలా కనిపిస్తాడని ఆమె అన్నారు. మా బ్యానర్ లో వచ్చిన నర్తనశాల ఫలితం నిరాశపరిచింది. అందుకే అశ్వథ్థామ చిత్రానికి ప్రాణం పెట్టి పనిచేశాం. ఎలాగైనా హిట్‌ కొట్టాలనుకున్నాం. సాధించాం అని అన్నారు. ఇక తమ బ్యానర్ లో ఒక శౌర్య తోనే కాదు కథకు సరిపోయే హీరోలు ఎవరితోనైనా సినిమాలు చేస్తాం అని ఆమె తెలిపారు. కాగా అశ్వథ్థామ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతంచేసుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu