HomeTelugu Big Storiesరాహుల్‌కి షాక్‌.. పెళ్లి చేసుకోబోతున్న పునర్నవి.. వరుడు అతడే!

రాహుల్‌కి షాక్‌.. పెళ్లి చేసుకోబోతున్న పునర్నవి.. వరుడు అతడే!

2 11
తెలుగు బిగ్‌బాస్-3 ఫేమ్‌ రాహుల్ సింప్లిగంజ్, పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా చెప్పనకర్లేదు ఈ జంట స్ర్కీన్‌ మీద పండించిన కెమిస్ట్రీ ప్రేక్షకులు అంత తొందరగా మర్చిపోలేరు. ఈ రియాలిటీ షో తరువాత కూడా వీరిద్దరు బయట జంటగా కనింపించారు. కలిసి పార్టీలు చేసుకుంటూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని ఈ ఇద్దరు ఖండిస్తున్నా.. ఆ రూమర్లకు మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా పునర్నవి రాహుల్ ఫ్యాన్స్‌కు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

అదేంటంటే.. త్వరలో పునర్నవి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో గత కొన్ని రోజులుగా రిలేషన్‌లో ఉన్న పున్నూ.. అతడిని వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాహుల్‌తో ప్రేమ వార్తలకు చెక్ పెట్టేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

2a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu