పూరిని ఫైనల్ చేశాడా..?

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే విషయంలో కన్ఫ్యూజన్
నెలకొంది. త్రివిక్రమ్, పూరిజగన్నాథ్ ఇలా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ
ఎన్టీఆర్, పూరీతో సినిమా చేయడానికి మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. పూరీ కూడా
ఎన్టీఆర్ కోసం కథను సిద్ధం చేసి ఆయనకు వినిపించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని
ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఎన్టీఆర్, పూరీ సినిమాకు గ్రీన్ సిగ్నల్
ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ గానం. ‘ఇజం’ సినిమా రిజల్ట్ చూసి పూరీకు ఛాన్స్ ఇస్తాడేమో అని
అందరూ భావించారు. కానీ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా తనను నమ్మి సినిమా ఓకే
చేయడంతో పూరీ చాలా సంతోశంగా ఉన్నాడట. రీసెంట్ గా కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ తదుపరి
సినిమా గురించి ఇజం సినిమా రిలీజ్ రోజు మాట్లాడతామని చెప్పారు కానీ సినిమా రిలీజ్ కు
రెండు రోజులు ముందుగానే ఎన్టీఆర్, పూరీ సినిమా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా
చేయడం కూడా ఇజం సినిమాకు పబ్లిసిటీలా పనికొస్తుందని భావిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates