ట్రెండింగ్‌లో ‘పుష్ప’ టీజర్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్ డే. ఈ సందర్భంగా ‘పుష్ప’ టీజర్‌ను ఒకరోజు (నిన్న) ముందుగానే చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్, 600కే లైక్స్ తో నెట్టింట్లో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ‘పుష్ప’ టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్స్ లో మొదటి స్థానంలో ఉంది. ఇక టీజర్ లో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్, రష్మిక మందన్న క్యూట్ లుక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నిర్మాణ విలువలు అదిరిపోయాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 13న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

CLICK HERE!! For the aha Latest Updates