
శ్రీవిష్ణు హీరోగా చైతన్య దంతులూరి డైరెక్షన్‌లో ‘భళా తందనాన’ సినిమా రూపొందింది. వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో, కేథరిన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్ విస్సా కథను అందించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘రాశానిలా కనబడనీ .. వినబడనీ ప్రేమలేఖ. చూశానీలా కదలననే వదలననే మౌనరేఖ’ అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ సినిమాకి అనురాగ్ కులకర్ణి – రమ్య బెహ్రా ఆలపించారు.
ఇంతకుముందు శ్రీ విష్ణు నుంచి వచ్చిన ‘రాజ రాజ చోర’ బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ తరువాత వచ్చిన ‘అర్జున ఫల్గుణ’ ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. ఇక ‘వరల్డ్ ఫేమస్ లవర్ తరువాత కేథరిన్ చేసిన సినిమా ఇదే.













