HomeTelugu Big Storiesపార్టీలో రాహుల్‌, పునర్నవి సందడి..

పార్టీలో రాహుల్‌, పునర్నవి సందడి..

1 29
బుల్లితెరపై తెలుగు.. ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’ విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌.. పునర్నవితో కలిసి ఓ పార్టీలో సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాతో రాహుల్‌ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు ప్రకాశ్‌రాజ్‌ ‘రంగమార్తాండ’ నటీనటులకు ఓ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలో రాహుల్‌తోపాటు పునర్నవి, రమ్యకృష్ణ, కృష్ణవంశీ పాల్గొన్నారు.

పార్టీలో భాగంగా రాహుల్‌.. ‘పడిపడి లేచె మనసు’ సినిమా నుంచి ‘ఏమైపోయావే నీ వెంటే నేనుంటే.. ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే..’ అనే పాట పడారు. అంతేకాదండోయ్‌ పాట పాడుతూ పునర్నవితో కలిసి డ్యాన్స్‌ కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోను రాహుల్‌ ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు.

‘ఇది ఒక అద్భుతమైన సాయంత్రం. మంచి పార్టీ ఇచ్చిన ప్రకాశ్‌రాజ్‌ సర్‌ ధన్యవాదాలు’ అని రాహుల్‌ తెలిపారు. రాహుల్‌ పోస్ట్‌ చేసిన వీడియో చూసిన నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. చూడచక్కని జంట అంటూ కామెంట్లు పెడు తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu