HomeTelugu Trendingనవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శికి రాహుల్‌ రామకృష్ణ వార్నింగ్‌

నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శికి రాహుల్‌ రామకృష్ణ వార్నింగ్‌

Rahul ramakrishna warning

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం జాతిరత్నాలు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌ అందుకుంది. ఇప్పటికే ఈ జాతిరత్నాలు 20 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చారు. భారీ లాభాలు రావడంతో సక్సెన్ టూర్‌ని కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సక్సెస్‌ టూర్‌లో భాగంగా నవీన్‌, ప్రియదర్శి అమెరికాకు వెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు అన్ని చోట్ల తిరుగుతున్నారు. వారి ప్రయాణంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్లను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన రాహుల్‌ రామకృష్ణ.. తనను అమెరికా తీసుకెళ్లకుండా మోసం చేశారంటూ.. ప్రియదర్శి, నవీన్‌లకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. మీరు రండ్రా మీ సంగతి చెబుతా..!’ అంటూ ఓ సరదా వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు రాహుల్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu