HomeTelugu Trendingనటుడిగా మారనున్న రాహుల్‌ సిప్లిగంజ్‌

నటుడిగా మారనున్న రాహుల్‌ సిప్లిగంజ్‌

3 2
తెలుగు ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’ రియాల్టీ షోలో విజేతగా నిలిచి తెలుగు ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకొన్న సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. తన పాటలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న రాహుల్‌ త్వరలో వెండితెరపై సందడి చేయబోతున్నాడట. సృజనాత్మక దర్శకుడిగా పేరున్న కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే రాహుల్‌ వెండితెరపైకి రాబోతున్నాడు. ఈ విషయాన్ని రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో తెలిపాడు.

‘కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. షూటింగ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. నటుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలి.’ అని రాహుల్‌ పేర్కొన్నాడు. మరి పాటలతో యువత మనసును కొల్లగొట్టిన రాహుల్‌ నటుడిగా ఇంకెంత సందడి చేస్తాడో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu