రాజ్ తరుణ్ తో హెబ్బా పెళ్లి!

‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న జంట రాజ్ తరుణ్, హెబ్బా పటేల్. ఆ తరువాత ఈడో రకం ఆడో రకం సినిమాతో మరోసారి తమ మ్యాజిక్ ను రిపీట్ చేశారు. ఇప్పుడు ఇద్దరు కలిసి మళ్ళీ స్క్రీన్ మీద కనిపించనున్నారు. ప్రస్తుతం హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాలో హెబ్బా బాయ్ ఫ్రెండ్స్ గా  అశ్విన్, పార్వతీశం, నోయల్ లు కనిపించనున్నారు. ఈ ముగ్గురిని ప్రేమించిన హెబ్బా ఎవరిని పెళ్లి చేసుకోవాలా అనే డైలమాలో పడుతుంది. అయితే సడెన్ గా క్లైమాక్స్ లో రాజ్ తరుణ్ వచ్చి హెబ్బాను పెళ్లి చేసుకొని తీసుకు వెళ్లిపోతాడట. రీసెంట్ గా వచ్చిన ‘మజ్ను’ సినిమాలో కూడా రాజ్ తరుణ్ ఇలాంటి అతిథి పాత్రలోనే కనిపించాడు. మరి వీరి హిట్ మ్యాజిక్ ఈ సినిమాకు రిపీట్ అవుతుందేమో చూడాలి!