HomeTelugu Big Stories'మా' అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ

‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ

MAA Elections
టాలీవుడ్‌లో ‘మా’ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి మా అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. ఇప్పటికే ఈ పోటీలో విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్ వెర్సస్ మంచు విష్ణు అనుకుంటున్నారు. తాజాగా జీవితా రాజశేఖర్ కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరి ముగ్గురి మధ్య పోటీ నెలకొనబోతుంది. ప్రస్తుతం జీవిత మా కార్యదర్శిగా ఉన్నారు.

ఇప్పటికే అధ్యక్ష ఎన్నికకు పోటీ చేస్తున్నట్టు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్‌ ప్రకటించారు. ఇప్పుడు వీరితో పాటు జీవిత రాజశేఖర్ కూడా పోటీలో ఉండటంతో పోటీ రసవత్తరంగా ఉండబోతుంది. ప్రకాష్‌ రాజ్‌కు మెగా సోదరుడు నాగబాబు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. మంచు విష్ణుకు అండగా తండ్రి మోహన్ బాబు రంగంలోకి దిగుతున్నారు. విష్ణుకి గతంలో అధ్యక్షుడిగా ఉన్న నరేష్ మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరు ఎవరెవరికి మద్దతిస్తారో తెలియాల్సి ఉంది. మా అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu