HomeTelugu Trendingరాజ్‌ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా'.. ఫస్ట్ సింగిల్ విడుదల

రాజ్‌ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’.. ఫస్ట్ సింగిల్ విడుదల

1 21
యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఈ చిత్రానికి కొండా విజయ్‌కుమార్‌ దర్శకుడు. ఈ చిత్రం నుంచి ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ పాటకు కె.కె. సాహిత్యం అందించగా అర్మాన్ మాలిక్, పి. మేఘన ఆలపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.

మా సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైనప్పటి నుంచి అన్నీ పాజిటివ్‌ వైబ్రేషన్సే కనిపిస్తున్నాయి. ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు మొదటి పాటకు సెకన్ల వ్యవధిలోనే మంచి వ్యూస్‌ వచ్చాయి. పాట ఎంతో బాగుందంటూ కామెంట్స్‌ కూడా పెడుతున్నారు. ఈ పాటకు కె.కె. చక్కటి సాహిత్యాన్ని, అనూప్‌ రూబెన్స్‌ మంచి మ్యూజిక్‌ను అందచేశారని మిగతా పాటలు కూడా బాగా కుదిరాయి. తప్పకుండా మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అవుతుందని నిర్మాత రాధామోహన్ అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu