HomeTelugu Trendingహెబ్బా పటేల్‌ 'సందేహం' ఫస్ట్‌లుక్‌

హెబ్బా పటేల్‌ ‘సందేహం’ ఫస్ట్‌లుక్‌

 

Hebah Patel New Movie First
బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కుమారి 21ఎఫ్ ఫేం తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ హెబ్బా పటేల్. ఓయ్‌ ఫేం ఆనంద్‌ రంగా దర్శకత్వంలో నటించిన వెబ్ సిరీస్‌ వ్యవస్థ ఇటీవలే డిజిటల్ ప్లాట్‌ఫాంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రైం, కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. కాగా ఈ భామ తాజాగా మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హెబ్బాపటేల్ నటిస్తోన్న తాజా చిత్రం సందేహం. సతీశ్ పరంవేద డైరెక్షన్‌లో థ్రిల్లింగ్ లవ్‌ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇంతకీ హీరోహీరోయిన్ల మధ్య ఎలాంటి థ్రిల్లింగ్ లవ్‌ ట్రాక్‌ చూపించబోతున్నాడన్నది సస్పెన్స్ పెడుతూ.. లాంఛ్ చేసిన లుక్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది.విష్ణు వర్షిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

ఒకవేళ నువ్వు అబద్దమాడితే.. చనిపోతావు.. హ్యాష్‌ ట్యాగ్‌తో వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్‌ మూవీపై అంచనాలు పెంచేస్తుంది. హెబ్బాపటేల్‌ దీంతోపాటు తెలిసినవాళ్లు, వల్లన్‌, ఆద్య సినిమాల్లో నటిస్తోంది. ఈ మూడు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu