రవితేజ సినిమాకు భారీ బిజినెస్!

‘బెంగాల్ టైగర్’ సినిమా అనంతరం చాలా గ్యాప్ తీసుకొని మాస్ మాహారాజ రవితేజ ‘రాజా ది గ్రేట్’, ‘టచ్ చేసి చూడు’ సినిమాలను లైన్ లో పెట్టాడు. ముందుగా ఈ రెండు సినిమాల్లో అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. దీంతో సినిమా రైట్స్ కు మార్కెట్ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. 
ఈ సినిమా శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు, హిందీ డబ్బింగ్ రైట్స్ మొత్తం అన్నీ కలిపి దాదాపు 18 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన సినిమా బిజినెస్ తో నిర్మాత దిల్ రాజు టేబుల్ ప్రాఫిట్ లో ఉన్నారని సమాచారం. రవితేజ గత చిత్రాలతో పోలిస్తే బిజినెస్ పరంగా ఈ సినిమాకు మంచి డీల్ కుదిరిందనే చెప్పాలి. ఈ సినిమా రవితేజ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా కనిపించనుండి. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.