రాజా కలెక్షన్లు కుమ్మేస్తున్నాడు!

రొటీన్ కథలతో బోర్ కొట్టేసిన రవితేజ చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా రాజా ది గ్రేట్. రెండు హిట్స్ కొట్టి కామెడీ ని బాగా డీల్ చేస్తాడని పేరు తెచ్చుకున్నఅని రావిపూడి డైరెక్షన్ లో బ్లైండ్ మ్యాన్ గా మెచూర్డ్ పెర్ఫార్మెన్స్ తో రాజా ది గ్రేట్ కి తేలికగా పాస్ మార్క్స్ వేయించాడు రవితేజ. ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ సినిమాకోసం జనాలంతా వెయిటింగ్ లో ఉండడంతో..రాజా ది గ్రేట్ కి కామెడీ నే కీలకంగా మారడంతో అలా ఈజీ గా కనెక్ట్ అయిపొయింది. ఒక్కడు సినిమాథి పోలికలు ఉన్నాయని అంటున్నా,రొటీన్ గానే ఉంది అని కొంత మంది పెదవి విరుస్తున్నా వసూళ్ళలో మాత్రం రాజా నిజంగానే గ్రేట్ అనిపిస్తున్నాడు. నాలుగురోజులకు వరల్డ్ వైడ్ గా ఏకంగా 31 కోట్లు కలెక్ట్ చేసి తిరుగులేని కమర్షియల్ హిట్ గా నిలిచింది.

అలాగే ఇప్పటికే 16 కోట్లవరకు షేర్ సాధించి ఈ వీక్ ఎండ్ లో సినిమాకొన్నవాళ్లందరిని సేఫ్ జోన్ లోకి తెచ్చేస్తుంది. పైగా ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ రిలీజ్ కాకపోవడంతో రాజా మరింతగా రెచ్చిపోవడం ఖాయం. దీపావళి లాంటి అన్ సీజన్ లో వచ్చి హిట్ కొట్టాడు రవితేజ. వరుసగా విజయాలతో దూసుకుపోతున్న దిల్ రాజుకి ఇది కచ్చితంగా ప్రాఫిట్ వెంచర్. ఈ హిట్ అనిల్ రావిపూడి కూడా స్టార్ హీరోలను డైరెక్ట్ గా,ధైర్యంగా అప్రోచ్ అవ్వడానికి ప్లాన్స్ వేసుకుంటున్నాడు. అయితే రాజా కధలో ఉన్న కంటెంట్ తో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తే తేడా కొట్టేస్తుంది.మొత్తానికి ఈ సినిమావరకు కోట్ల లో లాభాలు సంపాదించి పెడుతున్నాడు. సో.ఈ వీక్ అంతా కలెక్షన్స్ లో ఇదే జోరు కొనసాగితే రాజా సునాయాసంగా 50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టడం ఖాయం.