ఆర్‌ఆర్‌ఆర్‌లో అనుష్క.?

అరుంధతి సినిమాతో అనుష్క శెట్టి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన అనుష్క.. అరుంధతి సినిమా తరువాత నటన పరంగా ఎలాంటి పాత్రనైనా చేయగలను అని నిరూపించింది. అరుంధతి తరువాత బాహుబలి సినిమా ఆమెకు మరోమారు మంచి పేరు తెచ్చిపెట్టింది. భాగమతి సినిమాకు కూడా ఆమెకు పేరు తెచ్చింది.

అంతకు ముందు రుద్రమదేవి సినిమాతో రౌద్రాన్ని ప్రదర్శించిన అనుష్క సైరా సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయిగా చిన్న పాత్ర చేసింది. కాగా, ఇప్పుడు రాజమౌళి ఆమెకు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ చిన్న రోల్ ఇచ్చినట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఆ పాత్రకు అనుష్క అయితేనే సరిపోతుందని భావించిన రాజమౌళి ఆమెకు ఆ పాత్రను అఫర్ చేశారట. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునే విధంగా చేసిన రాజమౌళి సినిమాలో అఫర్ ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి. అనుష్క ఈ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30 వ తేదీన విడుదల కాబోతున్నది.