
Anushka Upcoming Movies:
2010లో జూన్ 4న రిలీజ్ అయిన “వేదం” సినిమా, తెలుగు ఇండస్ట్రీకి ఓ కొత్త ట్రెండ్‌ని తీసుకొచ్చింది. హైపర్లింక్ స్క్రీన్‌ప్లే, మల్టీస్టారర్ మూవీగా “వేదం” అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ లతో కలిపి ప్రేక్షకులను భలే ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి 15 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ ఒక ఫన్నీ మెమరీని షేర్ చేశారు. అప్పట్లో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, పంజాగుట్ట సర్కిల్ దగ్గర అనుష్క సెడక్టివ్ లుక్‌తో ఉన్న ఓ భారీ హోర్డింగ్ పెట్టారట. ఆ హోర్డింగ్ చూసి అంత మంది స్టాపై అటెన్షన్ లాస్ అవ్వడంతో ఏకంగా 40కి పైగా యాక్సిడెంట్లు జరిగాయట. చివరికి పోలీసుల కంప్లెయింట్లు రావడంతో ఆ హోర్డింగ్ తొలగించాల్సి వచ్చిందంట. అది అనుష్క కెరెక్టర్ హద్దుల్ని చెరిపేసిన రేంజ్!
View this post on Instagram
ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత మళ్లీ అనుష్క – క్రిష్ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. ఈసారి “ఘాటి” అనే రూరల్ క్రైమ్ డ్రామాతో వస్తున్నారు. 2025 జూలై 11న రిలీజ్ కానున్న ఈ సినిమాలో అనుష్క గంజాయి వ్యాపారంతో డీలింగ్ చేసే పాత్రలో కనిపించబోతుందట. ఈసారి కూడా అనుష్క క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్ గా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.
ఇది కచ్చితంగా ఓ విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ అదే కాంబినేషన్ అంటే, ఫ్యాన్స్‌లో కుతూహలం మామూలుగా లేదు. వేదం లా ఈ సినిమాకు కూడా సోషల్ ఇంపాక్ట్ ఉండేలా ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్.
ALSO READ: IPL 2025 final లో అనుష్క శర్మ వాచ్ ఖరీదు ఎంతంటే..