HomeTelugu News'శ్రీవల్లి'కి అతిథిగా రాజమౌళి!

‘శ్రీవల్లి’కి అతిథిగా రాజమౌళి!

బాహుబలి, భజ్‌రంగీ భాయిజాన్ చిత్రాల కథారచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం  శ్రీవల్లీ. రజత్, నేహాహింగే జంటగా  నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్‌కుమార్ బృందావనం  నిర్మిస్తున్నారు. ఈ నెల 23న  చిత్ర గీతాలను విడుదలచేయనున్నారు. ఈ ఆడియో వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దర్శకుడు విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ ఫిక్షన్ కథాంశానికి  ప్రేమ, యాక్షన్ హంగులను మేళవించి రూపొందిస్తున్న చిత్రమిది.

మనిషి మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఏం జరుగుతుందనే పాయింట్‌తో ఆద్యంతం ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. ఎరోటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని పంచుతుంది అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ  ఈ నెల 23న చిత్ర గీతాలను విడుదల చేయనున్నాం. ఈ వేడుకకు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఆయనతో పాటు ప్రముఖ హీరో,  కాజల్ అగర్వాల్‌తో పాటు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు అని తెలిపారు.  రాజీవ్‌కనకాల, సత్యకృష్ణ, హేమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్ శ్రీలేఖ, కెమెరా: రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సునీత.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!