బిగ్‌బాస్‌లో సందడి చేసిన సుధీర్ బాబు

తెలుగు బిగ్ బాస్-2 షోలోకి సినిమా ప్రమోషన్ లో భాగంగా పలువురు నటులు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో కూడా ‘దేవాదాస్’ సినిమా ప్రమోషన్‌ లో భాగంగానే అక్కినేని నాగార్జున కనిపించారు. ఇక నాగార్జున, నాని కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఈ సినిమాలో నటిస్తున్న నాని..బిగ్ బాస్ సీజన్ 2 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంటి సభ్యులకు దేవాదాస్‌ టీజర్ చూపించారు. కాగా నిన్నటి ఎపిసోడ్‌లో దేవ్ గా పరిచయం అయిన నాగార్జున..బిగ్ బాస్ హౌస్‌ లో మా దాసుని ఇబ్బంది పెడుతున్నారుట..గన్ లో ఆరు బుల్లెట్లు ఉన్నాయి..జాగ్రత్త అంటూ ఇంటి సభ్యులను హెచ్చరించాడు..తర్వాత వారితో కాసేపు ముచ్చటించాడు. బిగ్ బాస్ హౌస్ లో ‘దేవదాస్’ ట్రైలర్ కూడా చూపించారు.

నాగార్జున వెళ్లిన తర్వాత దేవదాస్ హీరోయిన్లు అకాంక్ష సింగ్, రష్మిక మందన కూడా కాసేపు బిబ్ బాస్ లో సందడి చేశారు. ఇదిలా ఉంటే..నేటి ఎపిసోడ్ లో మరో సినీ జంట సందడి చేశారు. సమ్మోహనం హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న హీరో సుధీర్ బాబు, నిర్మాతగా మారి నన్ను దోచుకుందువటే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా నాభానటేశ్ నటించారు. గత శక్రవారం విడుదల అయిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.

తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో.. సుధీర్ బాబు, నాభా నటేశ్ సందడి చేశారు. సుధీర్ బాబు హౌస్‌లో ఎంట్రీ ఇవ్వగానే మొదటి కౌశల్ ఆనందంతో సుధీర్‌ని హగ్ చేసుకున్నారు. హౌస్‌మెట్స్ అందరితో కలివిడిగా మాట్లాడిన సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సినిమా విషయాలను అందరితో షేర్ చేసుకున్నాడు. కొద్ది సేపు బిగ్ బాస్ హౌజ్ సభ్యులతో మాట్లాడిన సుదీర్ బాబు బయటకు వచ్చేశాడు. మరి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ జంట ఎంత మంది ప్రేక్షకుల మనసుని దోచుకుంటారో.