HomeTelugu Trendingసీఎం కొడుకుతో శివానీ రాజశేఖర్‌

సీఎం కొడుకుతో శివానీ రాజశేఖర్‌

Shivani Rajasekhar

సీనియర్‌ నటులు జీవిత, రాజశేఖర్‌ల ముద్దుల కూతురు శివానీకి తాజాగా తమిళంలో క్రేజీ ఆఫర్ వచ్చింది. ఇప్పటికే గుహన్‌ దర్శకత్వంలో ఆమె ఓ సినిమాలో చేస్తోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రంలో తేజ సజ్జతో కలిసి నటించబోతుంది. ఇప్పుడు తాజాగా ఓ తమిళ సినిమాలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. హిందీలో విమర్శకులనుంచి సైతం ప్రశంసలు అందుకున్న సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ‘ఆర్టికల్15’. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సరసన శివానీ నటించనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu