క్రిష్ కు రాజమౌళి రెండు సూచనలు!

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా రూపొందించాడు. ఈ సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా కోసం క్రిష్ కు రాజమౌళి రెండు విలువైన సజెషన్స్ ఇచ్చారట. అవేంటో.. క్రిష్ మాటల్లో..

”సాధారణంగా నా సినిమా కథలన్నీరాజమౌళి గారికి వినిపిస్తాను. ఎక్కడ సమయం దొరికితే అక్కడ చెప్పేస్తూ ఉంటాను. అలానే ఈ సినిమా కథ కూడా చెప్పాను. ఈ సినిమా కోసం ఆయన నాకు రెండు ముఖ్యమైన సజెషన్స్ ఇచ్చారు. అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కావాలంటే గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం వృధా చేయకుండా వీలైనంత రియల్ లొకేషన్స్ లో సినిమాను చిత్రీకరించమని చెప్పారు. అలానే మేము జార్జియాలో ఎక్కువ శాతం షూటింగ్ పూర్తి చేశాం. ఎక్కువగా గ్రాఫిక్స్ చేయలేదు. అలానే సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ ఆయనే ఫోన్ చేశారు. ఇప్పటినుండి నువ్వు నిద్రపోకు.. ప్రతి క్షణం పని చేస్తూనే ఉండమని చెప్పారు. రాజమౌళి సూచనల వలనే సినిమా ఔట్ పుట్ బాగా వచ్చిందని చెప్పారు.