రజిని రాజకీయ ప్రవేశం వారికి ఇష్టంలేదట!

ఇటీవల అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజకీయాల్లోకి వస్తానన్నట్లుగా ఆయన సంకేతాలు ఇచ్చారు. ఆ తరువాత మాత్రం ఆచితూచి మాట్లాడడం మొదలుపెట్టారు. త్వరలోనే మరోసారి అభిమానులతో భేటీ అవుతానని చెప్పిన సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలా..? వద్దా..? అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన సంగతి ఎలా ఉన్నా..? ఆయన కుటుంబ సభ్యులు మాత్రం రజిని రాజకీయ ప్రవేశం పట్ల అంత ఇష్టంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవనే ప్రచారం ఊపందుకుంది. రజినీకాంత్ భార్య, అతడి పిల్లలకు మాత్రం ఆయన రాజకీయాల్లోకి రావడం ఇష్టంలేదట. ఇప్పటికే రజినీకాంత్ ఆరోగ్యం చాలా రోజులుగా సరిగ్గా ఉండడం లేదనే వార్తలు 
వినిపిస్తున్నాయి. విదేశాల్లో వైధ్యం చేయించుకుంటున్నారు. 
తాజాగా మరోసారి ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో ఆయన రాజకీయాల్లోకి వస్తే మానసికంగా ఎలాంటి ఒత్తిడులు ఎదురవుతాయో.. అని ఆయన కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. రాజకీయాలు అంటే ప్రచారాలు అవి ఇవీ ఉంటాయి కాబట్టి శారీరకంగా కూడా శ్రమ పడాల్సివుంటుంది. ఈ పరిణామాల మధ్య ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం పట్ల అయిష్టతను వ్యక్తం చేశారట.