రజినీకాంత్-సల్మాన్ ఖాన్ క్రేజీ కాంబినేషన్!

సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించాలని చాలా మంది హీరోలు అనుకుంటుంటారు. ఇప్పటికే ‘రోబో2’ సినిమాలో రజినీకాంత్ తో కలిసి నటిస్తున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఇప్పుడు మరో హీరోతో రజినీకాంత్ కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘రోబో2’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు.

రజినీకాంత్ కు తను పెద్ద ఫ్యాన్ అని సల్మాన్ చెప్పాడు. రజినీకాంత్ కూడా సల్మాన్ ఓకే చెబితే ఆయనతి కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్ననని ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ వీరిద్దరితో కలిసి సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ చిత్రానికి వెంకటేష్ కో ప్రొడ్యూసర్ గా పని చేశారు. అలానే రజినీకాంత్ ‘లింగా’ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించారు. ఈ నేపధ్యంలో వీరిద్దరితో కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు త్వరలోనే చిత్ర విశేషాలను చెబుతానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.