HomeTelugu Big Storiesరివ్యూ: ఘాజీ

రివ్యూ: ఘాజీ

నటీనటులు: రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, కె కె మీనన్, అతుల్ కులకర్ణి, ఓం పురి, సత్యదేవ్ తదితరులు
సంగీతం: కె
సినిమాటోగ్రఫీ: మది
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: అన్వేష్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, పివిపి
రచన: గంగరాజు గుణ్ణం
కథనం: సంకల్ప్ రెడ్డి, గంగరాజు గుణ్ణం, నిరంజన్ రెడ్డి
దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి
1971 లో ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన జలాంతర్గామి యుద్ధ నేపధ్యంలో కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని రూపొందించిన చిత్రమే ‘ఘాజీ’. రానా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ కు ఎంతవరకు రీచ్
అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
బంగ్లాదేశ్ లో పోరాడుతున్న తమ సైన్యం కోసం 1971లో పాకిస్థాన్ నేవీ ‘ఘాజీ’ అనే సబ్ మెరైన్ ను పంపిస్తుంది. ఘాజీ బంగ్లాదేశ్ ను చేరుకోవాలంటే ముందుగా ఇండియన్ సబ్ మెరైన్ ను నాశనం చేసి వెళ్లాలి. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న భూగర్భ జలాలకు ఇండియన్ నేవీ అండగా ఉంటుంది.
అయితే పాకిస్థాన్ వారు వేసిన పన్నాగం ముందే తెలుసుకున్న ఇండియన్ నేవీ ఎస్-21 అనే సబ్ మెరైన్ ను సముద్రంలోకి పంపుతుంది. కెప్టెన్ రన్ విజయ్ సింగ్ (కె కె మీనన్), కమాండర్ అర్జున్ వర్మ(రానా), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవ్ రాజ్(అతుల్ కులకర్ణి)ల బృందం ఎస్-21 సబ్ మెరైన్
కు లీడ్ గా వ్యవహరిస్తుంటారు. అయితే పాకిస్థాన్ సబ్ మెరైన్ వారి మీద దాడి చేయకముందే మనమే వారిపై దాడి చేయాలని నిర్ణయించుకుంటాడు ఇండియన్ నేవీ కెప్టెన్ రన్ విజయ్ సింగ్. ఘాజీ మీదకు టార్పిడో ఫైర్ చేస్తాడు. దీంతో పాకిస్థాన్ సబ్ మెరైన్ ఘాజీ టీం సముద్రంలో అంతర్భాగంలో
ఎస్-21 వెళ్ళేరూట్ లో మైన్స్ ను ఏర్పాటు చేస్తుంది. ఆ మైన్స్ ను దాటుకొని వెళ్ళగానే ఇండియన్ సబ్ మెరైన్ పేలిపోవాలనేది ఘాజీ ప్లాన్. మరి ఇండియన్ సబ్ మెరైన్ ఆ మైన్స్ ను తట్టుకొని నిలబడుతుందా..? లేక అతి శక్తివంతమైన ఘాజీ ముందు ఇండియన్ నేవీ ఓడిపోతుందా..?
ఈ పోరులో గెలుపెవరిది..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
1971 లో సముద్ర అంతర్భాగంలో జరిగిన ఈ యుద్ధంపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. ఇండియన్ నేవీ ఘాజీను నాశనం చేశామని చెబుతుంటే.. పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం సబ్ మెరైన్ లో కొన్ని సమస్యల వలన మైన్స్ కారణంగా ఘాజీ పేలిపోయిందని చెబుతున్నారు. అటువంటి కథపై
వర్క్ చేసి సినిమాగా చేయాలనుకోవడం అభినందించాల్సిన విషయం. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా.. ఏ ఫ్రేమ్ లో కూడా ఆ ఫీలింగ్ రాదు. అంతబాగా సినిమాను డీల్ చేశాడు. ప్రతి విషయం ఎంతో వివరంగా, ప్రేక్షకులకు అర్ధమయ్యే రీతిలో చెప్తుండడం చూస్తుంటే.. ఈ ప్రాజెక్ట్ కోసం
తను ఎంత రీసెర్చ్ చేశాడో.. తెలుస్తుంది. ఎక్కువ శాతం కల్పితం జోడించే సినిమా చేశానని దర్శకుడు ముందే చెప్పేశాడు. కాబట్టి ఇది కూడా ఓ కథగా చూడొచ్చు.

కెప్టెన్ పాత్రలో కెకె మీనన్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. రానా కూడా తన పాత్రలో ఇమిడిపోయాడు. మొదటి భాగంలో వీరిద్దరి మధ్య వచ్చే సంబాషణలను ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించారు అతుల్ కులకర్ణి. అతని నటన కూడా ఆకట్టుకుంది. అయితే ఈ పాత్రల మధ్య ఎమోషన్స్ మరింత పండాల్సివుంది. డైరెక్టర్ ఈ విషయంపై ఇంకాస్త ఫోకస్ చేస్తే సినిమా ఇంకా బావుండేది. అసలు ఈ సినిమాలో తాప్సీ రోల్ కు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. ఫస్ట్ హాఫ్ సినిమా స్లో గా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు, సబ్ మెరైన్ సెట్, గ్రాఫిక్స్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

టెక్నికల్ గా ఈ సినిమా గ్రాండ్ గా ఉంది. మది ఫోటోగ్రఫీ సినిమాకు అసెట్ అయింది. విజువల్ గా సినిమా స్థాయి బావుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్లుగా ఉంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉండి.. ఓ కొత్త అనుభూతిని పొందాలనుకునే ప్రతి ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా ‘ఘాజీ’!
రేటింగ్: 3/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu