HomeTelugu Newsకరోనాతో ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య

కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య

Aishwarya Dhanush

రజనీకాంత్‌ కూతురు, స్టార్‌ హీరో ధనుష్‌ మాజీ భార్య ఐశ్వర్య కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకినట్లు తెలిపారు. దయచేసి అందరూ మాస్కులు ధరించాలి, కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు తెలిపారు. 2022 ఇంకా నాకోసం ఏం తీసుకొస్తుందో చూస్తా అంటూ పోస్టు చేశారు. ఐశ్వర్య త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు ధనుష్, ఐశ్వర్య జంట. కొద్ది రోజుల క్రితమే ధనుష్-ఐశ్వర్యలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీఁతో అభిమానులు నిరాశతో ఉన్నారు. వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ధనుష్ సైతం కరోనా బారినపడి కోలుకున్నారు.

హాస్యబ్రహ్మాకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!