HomeTelugu Newsఆర్జీవీ 'రక్తచరిత్ర' నటుడు అరెస్ట్‌

ఆర్జీవీ ‘రక్తచరిత్ర’ నటుడు అరెస్ట్‌

8 18
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నటుడు ఎజాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేసినట్టు ముంబై పోలీస్టులు తెలిపారు. ఇటీవల ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ రెండు వర్గాల మధ్య విద్వేషం పెంచేలా ఎజాజ్ ఖాన్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. గతంలో కూడా ఇలా రెండు వర్గాల మధ్య విద్వేషం పెంచేలా ఓ వీడియోను పోస్ట్ చేసినందుకు గత ఏడాది పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అంతే కాకా డ్రగ్స్ కేసులోనూ 2018లో ఓసారి అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక ఎజాజ్ ఖాన్‌ రక్త చరిత్ర సినిమా బుక్క రెడ్డి క్యారెక్టర్ చేసాడు. అతడిపై తొలుత సమన్లు జారీసేసిన పోలీసులు ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. సెక్షన్ 135ఏ తో పాటు పలు సెక్షన్ల కింత అతనిపై కేసులు నమోదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu