రకుల్ రెమ్యూనరేషన్ వింటే షాక్ తినాల్సిందే!

పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు తెలుగులో ఉన్న అగ్ర హీరోలందరి సరసన కూడా రకుల్ నటించింది. ఇప్పుడు తమిళంలో కూడా క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. కార్తీ సరసన ఓ తమిళ సినిమాలో నటిస్తుంది. రకుల్ కు తెలుగులో క్రేజ్ ఉండడంతో ఆమె తమ సినిమాల్లో నటిస్తే తెలుగునాట ప్లస్ అవుతుందనే ఆలోచనతో తమిళ స్టార్ హీరోలు సైతం ఆమెను సంప్రదిస్తున్నారు.
సూర్య, విజయ్, అజిత్ వంటి వారు కూడా రకుల్ ను తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే రకుల్ మాత్రం తమిళ ఫిల్మ్ మేకర్స్ కు తన రెమ్యూనరేషన్ తో భయపెడుతోందట. ఒక్కో సినిమాకు రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తుందని సమాచారం. తెలుగులో రకుల్ ఒక సినిమాకు కోటిన్నర వరకు చార్జ్ చేస్తుంది. అలాంటిది తమిళంలో ఇంకా ఎక్కువ అడుగుతుండడంతో నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారని సమాచారం.