తమిళంలో సక్సెస్ అవుతుందా..?

తెలుగులో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ తమిళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే ఆ సినిమాలేవీ కూడా రకుల్ కు కలిసి రాలేదు. దాంతో ఆమెకు అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన తరువాతే ఆమెకు కోలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయి. కార్తీతో ఒక సినిమా చేసిన రకుల్, త్వరలోనే సెల్వరాఘవన్
దర్శకత్వంలో సూర్యతో ఓ సినిమా చేయబోతుంది. అలానే ఈ మధ్య తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘స్పైడర్’ సినిమాలో కూడా రకుల్ హీరోయిన్ గా నటించింది.

ముగ్గురు కూడా స్టార్ హీరోలు కావడం.. మూడు వైవిధ్యభరిత చిత్రాలు కావడంతో ఈసారి రకుల్ ఖచ్చితంగా సక్సెస్ అందుకుంటాననే ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంతవరకు తమిళంలో హిట్ అందుకోలేకపోయినందుకు బాధగా ఉండేదని.. త్వరలోనే ఆ బాధ తీరిపోనుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. మరి ఈ చిత్రాలతో కోలీవుడ్ లో కూడా తన హవాను మొదలుపెడుతుందేమో చూడాలి!