రకుల్ ‘నీ జాకెట్‌ను ఇంత ఘోరంగా చింపేసింది ఎవరు’? డ్రెస్‌ వైరల్‌!

టాలీవుడ్‌ ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌కి గత కొంతకాలంగా సినిమాలేవీ రావడం లేదు. అయితే రకుల్‌ మాత్రం ఫిట్‌నెస్‌ అంటూ మరీ సన్నగా తయారైందని సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు అభిమానులు.

జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న వీడియోలు పోస్ట్‌ చేసే రకుల్‌… తాజాగా పోస్ట్‌ చేసిన ఓ పిక్‌పై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. మనలో ఉన్న చిన్నపిల్లల మనస్తతత్వాన్ని ఎప్పటికీ అలాగే ఉండనివ్వాలంటూ.. చిరిగిపోయిన డ్రెస్‌ వేసుకున్న పిక్‌ను పోస్ట్‌ చేశారు. అయితే ఈ పోస్ట్‌కు .. ‘నీ జాకెట్‌ను ఇంత ఘోరంగా చింపేసింది ఎవరు’ అంటూ తాప్సీ కామెంట్‌ చేయగా.. ‘నాలో ఉన్న చిన్నపిల్ల’ అంటూ చిలిపిగా రకుల్‌ రిప్లై ఇచ్చారు. అయితే ఫ్యాన్స్‌ మాత్రం.. రకుల్‌ను ఓ ఆట ఆడేసుకున్నారు. బిచ్చగాళ్లే నయం ఇంతకంటే మంచి డ్రెస్సులు వేసుకుంటారని ఒకరు, నీ దగ్గర డ్రెస్‌లు లేకుంటే నాకు చెప్పు నేను ఇస్తానుగా అని ఇంకొకరు, చిరిగిన డ్రెస్‌లు వేసుకుంటే ఒకప్పుడు పిచ్చొళ్లని అనేవారని, కానీ ఇప్పుడు వాటినే బ్రాండ్‌ అంటున్నారని మరొకరు కామెంట్‌ చేశారు. అయితే ఆ డ్రెస్‌ బాగుందని కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.