కోరమీసాలతో రామ్‌ చరణ్ లుక్‌ ..వైరల్‌


మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ ప్రస్తుతం ‘RRR’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షెడ్యూల్ ఓ అడవిలో వేగంగా జరుగుతుంది. చాలా సెక్యూరిటీ మధ్య రాజమౌళి అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్ సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. దీనిపై చిత్రయూనిట్‌కు కూడా క్లాస్ తీసుకున్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కూడా RRR సినిమా షూటింగ్ కోసం బయల్దేరాడు. ఇందులో అల్లూరి పాత్రలో నటిస్తున్నాడు చరణ్. కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఒక్కడే ఈ చిత్రం షూటింగ్‌లో ఉన్నాడు.

ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ చిత్రీకరించబోతున్నాడు దర్శకధీరుడు. దీనికోసమే RRR షూటింగ్ కోసం వెళ్తున్నాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో భార్య ఉపాసనతో చరణ్ వెళ్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ మెగా పవర్ స్టార్ లుక్స్ కూడా సోషల్‌ మీడియాలో బాగానే తిరుగుతున్నాయి. కోరమీసాలతో కిరాక్ పుట్టిస్తున్నాడు మెగా వారసుడు. భుజానికి బ్యాగ్ వేసుకుని అలా వేగంగా చిరుతలా నడుచుకుంటూ వెళ్తున్నాడు చరణ్.

ప్రస్తుతం ఆ ఫోటోలు బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఈ లుక్స్ చూసి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఈ సినిమా తర్వాత వరసగా స్టార్ డైరెక్టర్స్‌తో సినిమాలకు కమిటయ్యే ఆలోచనలో ఉన్నాడు చరణ్. ఓ వైపు హీరోగా బిజీగా ఉండి.. మరోవైపు నిర్మాతగానూ రచ్చ చేస్తున్నాడు చరణ్. చిరంజీవి, కొరటాల సినిమాను ఈయనే నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది.

 

CLICK HERE!! For the aha Latest Updates