శివలింగాన్ని శుభ్రం చేస్తున్న రామ్‌ చరణ్‌.. వీడియో.. వైరల్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ శివ‌రాత్రి సంద‌ర్భంగా భార్య ఉపాస‌న‌తో క‌లిసి గుళ్ల‌కు కూడా తిరిగేస్తున్నాడు‌. తాజాగా దోమ‌కొండ శివుడి గుడికి వెళ్లి అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు చేసారు. ఆ గుడికి మ‌రో ప్ర‌త్యేకత కూడా ఉంది. దాన్ని పున‌ర్మించింది ఉపాస‌న కుటుంబ స‌భ్యులే. కాకతీయుల కాలంలో అంటే.. సుమారు 800 ఏళ్ల క్రితం ఈ గుడిని నిర్మించారు. ఆ త‌ర్వాత దోమకొండ కోటను కూడా త‌మ కుటుంబ స‌భ్యులే 400 ఏళ్ల క్రితం నిర్మించార‌ని పోస్ట్ చేసింది ఉపాస‌న‌. దాంతో అక్క‌డ భ‌క్తులు కూడా ఈ గుడిని నిత్యం ద‌ర్శించుకుంటూనే ఉంటారు. ఇక ప్రతీ సంవత్సరం శివరాత్రి రోజు వేలాది మంది భ‌క్తులు వ‌స్తుంటారు.

ఇప్పుడు కూడా ఇదే చేసారు. ఇక ఈ సారి రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న ప్ర‌త్యేకంగా వెళ్లి సంప్రదాయ వస్త్రాలు ధరించి ఆ శివ‌య్య‌కు పూజ‌లు నిర్వ‌హించారు. చ‌ర‌ణ్ పంచె క‌ట్టుకుని వెళ్లాడు.. ఆయ‌న శివలింగాన్ని శుభ్రం చేస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఈయ‌న రాజ‌మౌళి RRR సినిమాతో బిజీగా ఉన్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates