HomeTelugu Trendingత్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనున్న శంకర్‌-చరణ్‌ మూవీ!

త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనున్న శంకర్‌-చరణ్‌ మూవీ!

Ram charan shankar movie sh
టాలీవుడ్‌ హీరో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌.. ప్రముఖ దర్శకుడు శంకర్‌తో ప్యాన్‌ ఇండియా మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారు. ఈ మూవీలో రామ్‌చరణ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారే యువకుడి పాత్రలో కనిపించనున్నారు అనే ప్రచారం సాగుతోంది. ‘ఇండియన్‌ 2’ సినిమా వివాదంలో చిక్కుకున్న శంకర్‌కు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఊరటనిచ్చాయి. దీంతో రామ్‌చరణ్‌తో శంకర్‌ చేయనున్న ఈ సినిమాకు లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది.

రామ్‌చరణ్, శంకర్, దిల్‌ రాజులు తాజాగా సమావేశమై ఈ సినిమా గురించి చర్చించుకున్నారనేది ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో.. కుదిరితే ఆలోపే ప్రారంభించాలని శంకర్ భావిస్తున్నరట‌. ఇలా.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ప్లాన్‌ను పక్కాగా రెడీ చేసే పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారాయన. కాగా ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా ఫిక్స్‌ చేసినట్లు వినికిడి. ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రామ్‌చరణ్‌-కియారా అద్వానీ జంటగా నటించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu