HomeTelugu Trendingకమల్ హాసన్ ఇండియన్-2 అప్డేట్

కమల్ హాసన్ ఇండియన్-2 అప్డేట్

Indian2 update

కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో ఇండియన్-2 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్. దీనిపై భారీ అంచనాలున్నాయి. గతంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వాన కురిపించింది.

తాజాగా ఇండియన్-2 మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

తాజా సమాచారం మేరకు ఇండియన్-2కి సంబంధించి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాలా పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది. దీనికోసం మరి కొన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉందట. వచ్చే ఏడాది చివరినాటికి లేదా 2025 జనవరి నాటికి పూర్తికావొచ్చని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

భారతీయుడు సీక్వెల్‌లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, ప్రియా భవాని శంకర్, సిద్దార్థ, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

కమల్ హాసన్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’లో కీలక పాత్ర చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu