మహేష్‌ మల్టీప్లెక్స్‌ పై వర్మ ట్వీట్‌

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు బిజినెస్‌మెన్‌గా మారిపోయాడు. అదేంటీ బిజినెస్‌మెన్‌ ఎప్పుడో అయిపోయాడు. ఆ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కూడా అయిపోయింది కదా అనుకుంటున్నారా? ఇక్కడ మాట్లాడేది సినిమా గురించి కాదులేండి. ఈ సూపర్‌స్టార్‌ హైదరాబాద్‌లో ఓ అధునాతన మల్టీప్లెక్స్‌ను నిర్మించాడు. దీన్ని రేపు (డిసెంబర్‌ 2) ప్రారంభించబోతున్నారు.

అయితే రీల్‌ లైఫ్‌లో బిజినెస్‌మెన్‌గా సక్సెస్‌ కొట్టన మహేష్‌.. ప్రస్తుతం రియల్‌లైఫ్‌లో బిజినెస్‌మెన్‌గా మారబోతున్నాడు. ఈ మల్టీప్లెక్స్‌ను ఏఎమ్‌బీ (ఆసియన్‌ మహేష్‌ బాబు)ను సందర్శించిన రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో దాన్ని వర్ణించాడు. దీనిపై ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘ఇప్పుడే ఏఎమ్‌బీ సినిమా స్ర్కీన్స్‌ చూశాను. డిసెంబర్‌ 2న ప్రారంభం కానుంది. బ్రీత్‌టేకింగ్‌ ఎక్స్‌పెరియన్స్‌ అంటూ.. మహేష్‌ ఎంత అందంగా ఉంటాడో అది కూడా అంత అందంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ మల్టీప్లెక్స్‌ను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రారంభించనున్నాడని సమాచారం.