‘రుద్రాక్ష’ తో కృష్ణ వంశీ!

దర్శకుడు కృష్ణ వంశీ గులాబీ సినిమాతో తన సినీ జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి.. రెండో సినిమాతో ఉత్తమ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. అప్పట్లో కృష్ణవంశీ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. మోస్ట్ వాటెండ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రతి సినిమాలో ఎదో ఒక సందేశం ఇచ్చేవాడు కృష్‌ణ వంశీ.

అయితే, ఇటీవల కాలంలో ఆయన సినిమాల్లో ఆ పస కనిపించడం లేదు. వరసగా ప్లాప్ అవుతున్నాయి. 2014లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమా తరువాత వంశీకి హిట్ లేదు. 2017లో తీసిన నక్షత్రం వంశీ ఆఖరిది చిత్రం. ప్రస్తుతం వందేమాతరం అనే సినిమా చేస్తున్నారు. దీంతో పాటు ఎప్పటి నుంచో అనుకుంటున్న మైథలాజికల్ మూవీ ‘రుద్రాక్ష’ సినిమాను మరలా తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాను బండ్లగణేష్ నిర్మిస్తున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.