HomeTelugu Big Storiesప్రకాశ్‌రాజ్‌పై వర్మ కామెంట్స్‌

ప్రకాశ్‌రాజ్‌పై వర్మ కామెంట్స్‌

Ram Gopal Varma comments on
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల అంశం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈసారి ‘మా’ ఎన్నికల్లో ఏకంగా నలుగురు సభ్యులు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితారాజశేఖర్‌, హేమ.. బరిలో ఉన్నారు. అయితే ప్రకాశ్‌ రాజ్‌ పోటీ చేయడంపై పలువురు ఇండస్ట్రీ సభ్యులు విమర్శల చేస్తున్నారు. ఆయన నాన్‌లోకల్‌ అని.. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కౌంటర్‌ ఇచ్చాడు.

‘కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాశ్‌రాజ్‌ నాన్‌లోకల్ అయితే, గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావు, నాగేశ్వరరావు, బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణ, తిరుపతి నుంచి మద్రాస్ బయల్దేరిన మోహన్‌బాబు లోకలా? మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిన రజనీకాంత్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్లిన అమితాబ్‌ బచ్చన్ లోకలా? ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని ముద్రించి, భార్యాపిల్లలతో ఇక్కడే ఉంటూ, తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడున్న ఎంతోమంది మహిళలకు పని కల్పిస్తున్న ఆయన నాన్ లోకలా? ప్రకాశ్‌రాజ్‌లోని ప్రతిభ గుర్తించిన ఈ దేశం నాలుగుసార్లు ఆయన్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే.. ఇప్పుడు అదే వ్యక్తిని నాన్‌లోకల్‌ అంటున్నాం’ అని ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu