దగ్గుబాటి ఫ్యామిలీ మల్టీస్టారర్!

అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమా చేసిన తరువాత ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాల వారు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని భావించారు. అందులో ముందుగా దగ్గుబాటి ఫ్యామిలీ పేరు వినిపిస్తుంది. అయితే ఇదే విషయాన్ని తాజాగా సురేశ్ బాబు వెల్లడించారు. వెంకటేష్, రానా, నాగచైతన్య ల కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలని నాన్నగారు ఆశ పడ్డారు.

అయితే ఆ కోరిక నెరవేరకుండానే ఆయన చనిపోయారు. ఆయన కలను నిజం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని సురేశ్ బాబు అన్నారు. త్వరలోనే వెంకీ, చైతు, రానాల మల్టీస్టారర్ సినిమా ఉంటుందని వెల్లడించారు. అయితే ఈ సినిమా ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి తొందరపడకుండా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే ఈ ముగ్గురు హీరోలు తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అందరికీ డేట్స్ కుదిరి మంచి స్క్రిప్ట్ దొరికితే తొందరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి.