HomeTelugu Trendingనటి జయసుధపై రామ్‌ గోపాల్‌ వర్మ ప్రశంసలు

నటి జయసుధపై రామ్‌ గోపాల్‌ వర్మ ప్రశంసలు

Ram gopal varma praises jay

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సహజనటి జయసుధ అంటే అభిమానం ఉంది. ఓ సినిమా పోస్టర్ పై ఉన్న జయసుధను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయారట. ‘శివరంజని’ సినిమాలో జయసుధ చేత కన్నీరు పెట్టించినందుకు మోహన్ బాబుపై ద్వేషం కూడా పెంచుకున్నారట.

ఆ తర్వాత జయసుధ, మోహన్ బాబులను పెట్టి 2014లో ఆయన ‘రౌడీ’ సినిమాను తీశారు. జయసుధతో ‘మనీ’, ‘మనీ మనీ’ సినిమాను కూడా నిర్మించారు. తాజాగా జయసుధను వర్మ ఆకాశానికెత్తేశారు. ‘దైవపుత్రుడు’ అనే క్రైస్తవ గీతాన్ని ఆమె పాడారు. ఈ గీతాన్ని ట్విట్టర్ లో వర్మ షేర్ చేశారు. ‘జయసుధగారూ, మీరు పాడిన పాట వింటే విశ్వాసం లేని వారు కూడా విశ్వాసులుగా మారిపోతారు’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు జయసుధ పాటకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లింక్ ను కూడా షేర్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!