‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు పోలింగ్‌ పెట్టి మరీ ప్రచారం చేస్తున్న వర్మ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా మొదలుపెట్టిన దగ్గర్నుండి వర్మ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. వివాదాలతోనే సినిమాకి కావాల్సినంత ఇమేజ్‌ను తెచ్చాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరకి వస్తుండటంతో రాబోయే ఎన్నికల్ని కూడా ప్రచారానికి వాడేస్తున్నాడు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల బంధం ఆధారంగా తీసిన ఈ సినిమా రాబోయే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా అంటూ ట్విట్టర్లో పోల్ పెట్టాడు వర్మ. రెండు గంటల్లోనే దానికి 11 వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. చిత్రం ఏమిటంటే 70 శాతం మంది నెటిజన్లు సినిమా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని ఓట్ చేయడం గమనార్హం.

CLICK HERE!! For the aha Latest Updates